హిందూ ఎన్ సైక్లోపీడియా


ఎన్ సైక్లోపిడియా ఆఫ్ హిందూయిజం గ్రంథాన్ని ఆవిష్కరిస్తున్న గౌరవనీయ భారత రాష్ట్రపతి శ్రీ ప్రణబ్ ముఖర్జీ, చిత్రంలో కేంద్రమంత్రి రవిశంకర్ ప్రసాద, భాజపా అగ్ర నాయకుడు ఎల్.కె. అద్వాని

 
హిందూ పరంపర పరిశోధనా సంస్థ (I.H.R.F.) కు అనుబంధంగా పరమార్థనికేతనం అనే వేదికకు వ్యవస్థాపక అధ్యక్షుడైన చిదానంద సరస్వతి స్వామి వారు ఎన్ సైక్లోపిడియా ఆఫ్ హిందూయిజం (సమగ్ర హిందూ ధర్మ గ్రంథం) అనే గ్రంథాన్ని రచించారు. హిందూ విలువలు, జీవన విధానంపై ఇటువంటి ఒక గ్రంథం వెలువడటం ప్రపంచంలోనే ఇది మొదటిసారి. ఈ పుస్తకంలో చరిత్ర, తత్వశాస్త్రం, వైజ్ఞానిక సమాచారం, కళలు, సంస్కృతి, సమకాలీన సమాచారం, నిర్మాణ విజ్ఞానం మరియు వాస్తు శాస్త్రానికి సంబంధించిన అనే విషయాలపై 3,507 వ్యాసాలున్నాయి. ఈ గ్రంథాన్ని జూన్ 23నాడు క్రొత్త ఢిల్లీలోని రాష్ట్రపతి భవనంలో శ్రీ ప్రణబ్ ముఖర్జీ ఆవిష్కరించారు. 
 
 
 
ఆ సందర్భంగా రాష్ట్రపతి మాట్లాడుతూ... "హిందుత్వం అంటే నిరంతర సత్యాన్వేషణ, ధర్మాచరణ, అధ్యాత్మిక చింతన మొదలైన ఉన్నత విలువలతో కూడిన అధ్యయనం మాత్రమే, దేవుడు లేడన్నా సరేగాని, సత్యం, ధర్మం లేవు అంటూ హిందువు ఊరుకోడు" అని రాష్ట్రపతి తన ప్రసంగంలో అన్నారు.  
 
గ్రంథం అవిష్కరణ కార్యక్రమంలో భాజపా వృద్ధనాయకుడు లాల్ కృష్ణ అద్వాని, కేంద్ర న్యాయశాఖ మంత్రి రవిశంకర్ ప్రసాద మరియు నీటివనరుల శాఖ మంత్రిణి ఉమాభారతి పాల్గొన్నారు.
 
- ధర్మపాలుడు