హిందుత్వం మతం కాదు


నాగపూర్ లోని ఇన్ కంటాక్స్ ట్రిబ్యునల్ ఒక కేసు విచారణలో తీర్పునిస్తూ హిందుత్వము అనేది మతం కాదని, శివుడు, హనుమంతుడు, దుర్గ మొదలైన దేవతలందరూ ప్రకృతిలోని శక్తులని, ఈ దేవతలందరూ ఒక మతానికి చెందినవారుగా చెప్పలేమని చెప్పారు. 

''శివుడు, హనుమంతుడు, దుర్గ మొదలైన దేవాలయాల పూజల ఖర్చులు మతపరమైన ఖర్చులుగా భావించలేము'' అని ట్రిబ్యునల్ తీర్పునిచ్చింది. నాగపూర్ లోని ఒక శివాలయ కమిటీ వేసిన కేసుపై ట్రిబ్యునల్ ఈ తీర్పునిస్తూ ఆ శివాలయ ఖర్చులకు ఇన్ కంటాక్స్ నుండి మినహాయింపు ఇవ్వాలని చెప్పింది.

పూర్తి వివరాలకు మార్చి 17 నాటి నాగపూర్ టైమ్స్ లేదా ఆంధ్రజ్యోతి దినపత్రికలను చూడవచ్చు.

- రాము