మహాత్మా బాబర్....


బాబర్ మహాత్ముడా? అని ఆశ్చర్యపోకండి. ఔరంగజేబు శాంతికపోతం, 'గతంలో హిందూ దేశంమీద దాడి చేసిన తురక ఘాతకులందరూ మంచివాళ్లు' అని మనం అనుకునే విధంగా ఉంది మన దేశ ప్రభుత్వం మరియు రాజకీయ నాయకుల వైఖరి. కాశీ, మధుర, సోమనాథ్ లను నాశనం చేసినా ముస్లింలు వాటిని పుణ్యక్షేత్రాలుగా గుర్తించారు. కాని మన ప్రభుత్వం దృష్టిలో కాశీ ఒక మునిసిపాలిటి, మధుర ఒక పట్టణం, కేదారనాథం బదరీనాథంలు గ్రామాలు అంతే. వాటికి విలువ గాని, గౌరవం గాని లేవు. నిన్న గాక మొన్న కేదారనాథంలో జరిగిన ఘోరకలి మనం ఇంకా మరిచిపోలేదు. అయినా కూడా 'అభివృద్ధి' పేరుతో దేవభూమి ఐన ఉత్తరాంచల్ ను చిన్నాభిన్నం చేస్తున్నారు కాంగీయులు. అలకనంద, మందాకిని వంటి పవిత్ర నదులను అడ్డుకుంటూ, హిమాలయాలలో కొండలు ప్రేల్చివేస్తున్నారు. క్షేత్రాలను కాంక్రీటు వనాలుగా మారుస్తున్నారు. దీనికి వ్యతిరేకంగా కమ్యూనిస్టులు కూడా గొంతు కలపవలసి వచ్చింది.

హిమాలయాలలోని జోసీమఠం గ్రామస్తులు నిరసన ప్రదర్శనలు చేస్తున్నారు. 'లతా తపోవనం - హైడ్రో ఎలక్ట్రిక్ ప్రాజెక్టు' కోసం పరిసర వాతావరణం నాశనం చేస్తున్నారు. వీరి చర్చల కారణంగా అమరనాథంలోని మంచు లింగానికి కూడా ప్రమాదం ఏర్పడబోతోంది. సి.పి.ఐ. (ఎం.ఎల్.) పార్టీకి చెందిన అమల్ శెట్టి ఈ విధంగా వాపోతున్నారు 'భూ సొరంగ మార్గం కోసం హిమాలయాలలో ప్రేలుళ్లు జరిపి ప్రకృతి వినాశనం చేస్తున్నారు. ఇది వెంటనే ఆపాలి'.

- ధర్మపాలుడు