నరేంద్రమోది అడుగు జాడలలో...

తల్లిదండ్రులతో అమిత్, సుమిత్
 
'టీ అమ్మటం మొదలుపెట్టి ఒక్కొక్క మెట్టు పైకి ఎక్కి ప్రధానమంత్రి అయిన నరేంద్రమోది అడుగుజాడలలో మేము కూడా నడుస్తాము, ఆయన లాగే దేశసేవ చేయాలని మా కోరిక' అంటున్నారు జలంధర్ (పంజాబ్) కు  చెందిన అమిత్, సుమిత్ అనే ఇద్దరు అన్నదమ్ములు. 
 
అమిత్, సుమిత్ ల తండ్రి జలంధర్ లోనే ఒక 'టీ' కొట్టు నడుపుకుంటూ పిల్లల్లి చదివిస్తున్నారు. క్రిందటి సంవత్సరం IIT-JEE పరీక్షలలో అమిత్, సుమిత్ లు మంచి ర్యాంకులు సాధించి IITలో సీట్లు పొందారు. కాని తండ్రి అకాల మరణంతో 'టీ' కొట్టు బాధ్యత చేపట్టారు. డబ్బులు లేని కారణంగా IITలో చేరలేకపోయారు. వీరు ఈ సంవత్సరం మళ్ళీ IITలో 209, 2014 ర్యాంకులు తెచ్చుకుని ప్రతిష్ఠాత్మకమైన IIT సీట్లు సాధించారు. వీరికి ఎవరైనా ఆర్ధికసాయం చేసి, వారి కలలు సాకారం చేస్తారని ఆశిద్దాం.
 
- ధర్మపాలుడు