కాంగ్రెస్ లో ఆ పని సాధ్యం కాదు

(డాక్టర్జీ - గాంధీజీ సంభాషణ)

హితవచనం

డాక్టర్ హెడ్గేవార్

"కాంగ్రెస్ లో ఉత్తములెందరో ఉన్నారు. ప్రశ్న మన:ప్రవృత్తుల గురించి. కాంగ్రెస మన:ప్రవృత్తి ఒక రాజకీయ ప్రయోజనాన్ని సాధించే దృష్టితో నిర్మాణమైంది. కాంగ్రెసుకు తన కార్యక్రమాలను నిభాయించడానికి స్వచ్ఛంద సేవకులు కావాలి. 

స్వయంప్రేరణతో పనిచేసే వ్యక్తుల శక్తివంతమైన సంఘటన ఏర్పడితే సమాజానికి సంబంధించిన అన్ని సమస్యలు పరిష్కారమవుతాయనే నమ్మకం కాంగ్రెసుకు లేదు. కాంగ్రెసు దృష్టిలో స్వచ్ఛంద సేవకులంటే కూలి తీసుకోకుండా సభలలో, సమావేశాలలో కుర్చీలు, బెంచీలు సర్దుతూ పనిచేసే వలంటీర్లని భావం. 

అలాంటి మనస్తత్వం ఉన్న చోట రాష్ట్రం యొక్క సర్వతోముఖాభివృద్ధిని సాధించే కార్యకర్తలు ఎలా ఉద్భవిస్తారు? అందుకే కాంగ్రెసులో ఈ పని సాధ్యం కాదు" అని ప.పూ.శ్రీ డాక్టర్జీ (డా.హెడ్గేవార్) గాంధీజీతో కాంగ్రెస్ గురించి స్పష్టం చేశారు.