న్యాయమూర్తులుగా అర్హత ఉన్నవారే ఉండాలి

హరీశ్ సాల్వే

హైకోర్టు న్యాయమూర్తులు, సుప్రీంకోర్టు న్యాయమూర్తులకు ఉన్నటువంటి అపరిమిత అధికారాల దృష్ట్యా ఆ విధమైన బాధ్యతాయుత పదవుల కోసం అత్యుత్తమ అర్హతలు కలిగిన వ్యక్తులనే నియమించాలి. అంతే తప్ప అలాంటి పదవుల్లో ఎవరిని పడితే వారిని నియమించటం ఎంతమాత్రమూ సమంజసం కాదు. ఒకవేళ ఆరోపణలు ఎదుర్కొంటున్న (మంచి కావచ్చు లేదా చెడ్డగా కావచ్చు) ఒక వ్యక్తిని న్యాయమూర్తి పదవిలో కొనసాగించేందుకు ఏదైనా వ్యవస్థ అనుమతించిన పక్షంలో అలాంటి వ్యవస్థను తప్పనిసరిగా పున:సమీక్షించాల్సిన అవసరముంది. న్యాయమూర్తులు సీజర్ భార్యలాంటి వారు. వారిని ఎప్పుడూ అనుమానమనే దృష్టి కోణానికి అతీతంగానే చూడాలి. రెండవది - ప్రధాన న్యాయమూర్తి కార్యాలయానికి ఇలాంటి వివాదాన్ని అంటగట్టే వ్యవస్థను తప్పకుండా మార్చాల్సిందే.

- హరీశ్ సాల్వే
సుప్రీంకోర్టులో ప్రముఖ న్యాయవాది