కర్షకులకు శుభవార్త

'కాదేదీ కవితకనర్హం' అన్నారు ప్రముఖ కవి శ్రీశ్రీ. 'కాదేదీ వ్యర్థం' అంటున్నారు డాక్టర్ అలగేశన్, నాగేశంలు. గ్రామాలలో సాధారణంగా చెత్తగా పరిగణించే చాలా పదార్థాలు ఎంతో ఉపయోగకరం అంటున్నారు గోపిశెట్టి పాలెంలో ఉన్న కృషి విజ్ఞానకేంద్రం శాస్త్రవేత్త డాక్టర్ పి.అలగేశన్. మొక్కలు, చెట్లు, గొడ్డూ, గోదా కారణంగా ఉత్పన్నమయ్యే వ్యర్థ పదార్థాలు అన్ని కూడా 'అర్థ' పదార్థాలు అంటున్నారీయన.  ఈ వ్యర్ధాలను సరిగ్గా ఉపయోగిస్తూ, డబ్బూ, విద్యుత్తు కూడా మిగుల్చుకోవచ్చు. వర్మీ కంపోస్టు, పురుగు మందులు, బయోగ్యాసు ఈ చెత్తతోనే రూపొందిస్తాము అంటున్నారు దొడ్డి గ్రామానికి చెందిన కర్షకుడు నాగేశం. పది సంవత్సరాల నుండి ఈ ప్రయోగాలు చేస్తున్న నాగేశం నెలకు రూ.500 వరకు వ్యయం తగ్గించుకున్నారు. దినానికి 15 కిలోల ఆవుపేడ, 10 నుండి 20 లీటర్ల గోమూత్రం కూడా ఉపయోగిస్తాడు. తన పొలంలోనే వాన నీటిని భద్రపరిచే ట్యాంకు నిర్మించుకున్నాడు. భారతీయ పద్ధతిలో వ్యవసాయం చాలా లాభదాయకం అంటున్నారు అలగేశన్, నాగేశంలు.
- ధర్మపాలుడు