నరేంద్రమోడీ - ఓ ట్రెండ్ సెట్టర్

భారతదేశ రాజకీయాల్లో భాజపా ప్రధానమంత్రి అభ్యర్థి నరేంద్ర మోడీ తనదైన శైలిలో ఒక ట్రెండ్ సెట్టర్ గా మారిపోయారు. ఇప్పటికే ఫేస్ బుక్, ట్విట్టర్లలో ఎన్నికల ప్రచారాన్ని కొత్త పుంతలు తొక్కించిన మోడీ, ఇప్పుడు దేశవ్యాప్తంగా వరుస ర్యాలీలతో దూసుకుపోతున్నారు. దేశంలోని ఏ ప్రాంతానికి వెళ్లినా అక్కడి భాష, వేషం, సంస్కృతికి తగిన గెటప్ లలో అలరిస్తున్నారు.  
గత నెలలో ఆయన ఈశాన్య భారతంలో పర్యటించారు. మారుమూల అరుణాచల్ ప్రదేశ్ కు వెళ్లి అక్కడి స్థానిక గిరిజనుల తలపాగాను ధరించారు. అస్సాం, మణిపూర్ లలో ర్యాలీలు నిర్వహించారు. ఇక హిమాచల్ ప్రదేశ్ లో స్థానికులు ధరించే టోపి, భుజంపై కండువాతో అలరించారు. పంజాబ్ లోని లూథియానాలో సంప్రదాయ సిక్కు తలపాగా ధరించి సుమారు అరగంట పాటు చేసిన ప్రసంగం అందరిని సమ్మోహితుల్ని చేసింది. ఎన్నికల షెడ్యూల్ వెలువడేలోపు దేశవ్యాప్తంగా 100 ర్యాలీలు పూర్తిచేయాలనే లక్ష్యంతో దూసుకుపోతున్న నరేంద్రమోడి ఇంకా ఏమేమి ట్రెండ్స్ సెట్ చేస్తారో...! వేచి చూడాల్సిందే.  

- నారద