భారత్ సత్తాను ఇస్రో ప్రపంచానికి చాటింది

ప్రముఖుల మాట

 
"ఇస్రో విజయ పరంపరలో మరో అద్భుత విజయానికి ప్రత్యక్ష సాక్షిని అయినందుకు నేను ఎంతో గర్వపడుతున్నాను. వరుస విజయాలతో అంతరిక్ష పరిశోధనల్లో భారత్ సత్తాను ఇస్రో మరోసారి ప్రపంచానికి చాటిచెప్పింది. ప్రతి భారతీయుడు గర్వపడే సమయం ఇది. ఇతర దేశాలకు చెందిన ఉపగ్రహాలను మనం నింగిలోకి పంపడం అంతరిక్ష పరిశోధనల్లో మన ఉన్నతికి నిదర్శనం. ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో ఐదు దేశాల ఉపగ్రహాలను 660 కిలోమీటర్ల ఎత్తులో కక్ష్యలో ప్రవేశపెట్టడం అభినందనీయం. అంతరిక్ష పరిశోధనల్లో భారత్ సుదీర్ఘ ప్రయాణం విజయవంతంగా కొనసాగుతోంది.

- గౌరవనీయ భారత ప్రధాని శ్రీ నరేంద్రమోది

జూన్ 30 నాడు శ్రీహరికోటలో పి.ఎస్.ఎల్.వి. సీ-23 ప్రయోగం విజయవంతమైన సందర్భంగా ఇస్రో శాస్త్రవేత్తలను అభినందిస్తూ, భారత ప్రజలను ఉద్దేశించి ఇచ్చిన సందేశం.