వైజ్ఞానిక హిందుత్వం


'మతం మత్తు మందు' అన్నాడు కమ్యూనిస్టు సిద్ధాంతకర్త కారల్ మార్క్స్. 'ధార్మికత లేని శాస్త్రం కుంటిది - శాస్త్రీయత లేని మతం గ్రుడ్డిది' అన్నాడు ఆల్బర్ట్ ఐన్ స్టీన్. ఎవరేది అన్నప్పటికీ హిందుత్వం తన విశిష్టతను చాటుకుంటూనే ఉన్నది. హిందూమతం యొక్క విశేష శాస్త్రీయతను ప్రపంచం ఎప్పుడో గుర్తించింది. 

దేవాలయాల్లో దేవుళ్లకు చేసే అభిషేకాలు మనకు తెలిసినవే. శివాలయాల్లో ఐతే సహస్రకుంభాభిషేకాలు కూడా జరుగుతున్నాయి. రాజస్థాన్ జైపూర్ నగరంలోని శివాలయంలో పురుషోత్తం గౌర్ అనే వ్యక్తి చేసిన ప్రయోగంతో గుడిలో ఉన్న ఎండిపోయిన బోరుబావిలో నుండి నీరు ఉబికివచ్చిన సంఘటన జరిగింది. 

విషయం ఏమిటంటే దేవాలయంలో అభిషేకం జరపడానికి ఉపయోగించిన నీరు, పాలు గర్భగుడి నుండి బయటపడి నేలమీద చిత్తడిగా మారటం, భక్తులు కాలితో త్రొక్కడం జరుగుతున్నది. దీనిని గౌర్ దీనిని అపవిత్రంగా భావించి అభిషేకించిన నీరు, పాలు భూమిలోకి ఇంకే ఏర్పాటు చేశారు. దీనివల్ల పాలు, నీటి యొక్క పవిత్రత కాపాడబడింది. భూమిలోకి చేరిన పాలు, నీరు, భూగర్భ జలాలను వృద్ధి చేశాయి. భక్తులు సంతోషించారు. 

ఈ ప్రయత్నం రాజస్తాన్ లోని 305 దేవాలయాలలో కూడా చేపట్టబోతున్నారు. కాలానుగుణంగా మారగలిగే ఔన్నత్యమున్న హిందుత్వం ఎంత గొప్పదో కదా? భక్తి, విజ్ఞానం కలగలిసిన హిందువులకు ఈ సమస్య లేదు.

- టైమ్స్ 28/5/2013

- ధర్మపాలుడు