నీవు చేస్తే తప్పు - నేను చేస్తే ఒప్పు


పశ్చిమ బెంగాల్ సింగూరు గ్రామంలో పారిశ్రామికవేత్త రతన్ టాటా కార్లు రూపొందించే కర్మాగారం ప్రారంభించాలనుకున్నారు. రాష్ట్రప్రభుత్వం భూమిని కూడా కేటాయించింది. అయితే ! అప్పటి ప్రతిపక్ష నాయకురాలు మమతా బెనర్జీ భూమి కేటాయింపు విషయంలో రాద్ధాంతం చేసి పేదల నోట్లో మట్టి కొడుతున్నారని ఆరోపించి ఉద్యమాలు లేవదీసి చివరకు టాటా కంపెనీని సింగూరు నుండి వెళ్లగొట్టింది.

ఇప్పుడు దృశ్యం మారింది. మమత ముఖ్యమంత్రి అయింది. ఇంకేం! న్యాయాలు మారిపోయాయి. ఇప్పడు స్వయంగా మమతగారే పారిశ్రామికవేత్తలను ఆహ్వానిస్తోంది. "భూమి ఎంత కావాలంటే అంత ఉంది. రండి రండి" అని పిలుస్తున్నది. దుర్గాపురం వద్ద ఒక క్రొత్త విమానాశ్రయం నిర్మిస్తూ దానికి "ఖాజీనజుర్-ఉల్-ఇస్లాం" అని పేరుకూడా పెట్టింది. అధికారంలో ఎవ్వరు ఉన్నా బూటకపు సెక్యులరిజం మాత్రం తప్పదు.

- ధర్మపాలుడు