'ధర్మశక్తి' ఆవిర్భావం

  • హిందూ మతంపై దాడులను ప్రతిఘటించాలి
  • లేదంటే మైనారిటీలుగా మారే ప్రమాదం

బహుముఖ దాడుల వల్ల మనుగడ ప్రమాదంలో పడిన హిందూ మతాన్ని, ధర్మాన్ని సంరక్షించేందుకు వివిధ రంగాల్లో పనిచేస్తున్న హిందూ సంస్థల, పలువురు ధర్మాచార్యుల తోడ్పాటుతో, సద్గురు శివానందమూర్తి ఆశీస్సులతో 'ధర్మశక్తి' అనే నూతన సంస్థ ఆవిర్భవించింది. సికింద్రాబాద్ లోని కౌతా స్వరాజ్య విహార్ లో జూన్ 30న 'ధర్మశక్తి' సన్నాహక సభ జరిగింది.


కమిటీ ఏర్పాటు : ధర్మశక్తి సంస్థను సంస్థాగతంగా వ్యవస్థీకృతం చేయడానికి అడహక్ కమిటీ ఏర్పాటు జరిగింది. కమిటీ కన్వీనర్ గా ఎం.వి.రమణ శర్మ, సభ్యులుగా డాక్టర్ కసిరెడ్డి వెంకటరెడ్డి, టి.హనుమాన్ చౌదరి, యెల్లాప్రగడ ప్రభాకర శర్మ, పవనగిరి స్వామి, డాక్టర్ భగవంతరావు, రాజాసింగ్, యాదగిరిరావు, సత్యవాణి, గవరయ్య, నాగేంద్రప్రసాద్, ఉమాకాంత్, కె.శ్యాంప్రసాద్ లు ఎంపికయ్యారు.


హిందువులు ఇతర మతాలలోకి మారకుండా చూస్తే సగం సమస్యలు పరిష్కారమవుతాయని వక్తలు అభిప్రాయపడ్డారు.