ధర్మరాజుకే జయం

'భాజపా మతోన్మాద పార్టీ - నరేంద్ర మోడి రక్తపిపాసి, నరరూప రాక్షసుడు' అంటూ ఎన్నో అవాకులు, చెవాకులు ప్రేలిన నోళ్ళు మూతపడ్డాయి. నరేంద్రమోడికి గల ప్రజాదరణ పట్ల మొదట కళ్ళు మూసుకున్నా ఇప్పుడు విధిలేని పరిస్థితులలో ఒక్కొక్కరుగా "నాయకులు" దారికొస్తున్నారు.  
ఎందుకు రారు? నరేంద్రమోడితో స్నేహం చేయడానికి శక్తివంతమైన పాశ్చాత్య దేశాలు వరుసలో నిలబడి ఎదురు చూస్తున్నారు. సత్యాన్ని, ధర్మాన్ని నమ్ముకున్న నరేంద్రమోడి పది సంవత్సరాలకు పైగా శత్రు ప్రభంజనానికి ఎదురు ఈదాడు మరి. 
తమిళ దినప్రతిక "దినమలార్"కు ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో డి.ఎం.కె. వృద్ధ నాయకుడు ముత్తువేల్ కరుణానిధి నరేంద్రమోడిపై ప్రశంసల జల్లు కురిపించాడు. ఈ ఇంటర్వ్యూ రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమైంది. మోడి ఎంతో శ్రమజీవి అంటూ పొగడ్తల్లో ముంచెత్తాడు కరుణానిధి. 
ఆలస్యంగానైనా వాస్తవాన్ని ఒప్పుకొన్నందుకు కరుణానిధికి అభినందనలు !
- ధర్మపాలుడు