మధుమేహము తగ్గుతుంది

గృహ వైద్యము - 15

 
మధుమేహము తగ్గుతుంది 
  • 12 గ్రాముల ప్రత్తి గింజలను నలగగొట్టి ఒక లీటరు నీళ్లలో వేసి కషాయముగా కాచి చల్లార్చాలి. ఆ కషాయాన్ని ప్రతినిత్యమూ త్రాగవలెను. ఈ విధముగా చేసిన మధుమేహము నలభై దినములలో తగ్గిపోవును.
  • నేరేడు గింజలలోని పప్పును నీళ్లలో వేసి కషాయము వలె కాచుకొని, ఆ కషాయాన్ని కాఫీ వలె పాలతో కలిపి ప్రతిరోజు సేవించిన ఎడల మధుమేహము తగ్గిపోవును.
  • ప్రతిరోజు ఉదయం పూట ఒక మైలు దూరము నడిచి మూడు నారింజకాయల రసము త్రాగిన ఎడల మధుమేహము నలభై రోజులలో తగ్గిపోవును.
  • ఏగి చెక్కను ఒక గ్లాసు నీళ్లలో ఒక రాత్రి నాననిచ్చి ఉదయం ఆ నీళ్లను సేవించాలి. అట్లు నలభై రోజులు చేసినచో మధుమేహము తగ్గిపోవును. ఒక ఏగి చెక్క ముక్కను 15 రోజుల వరకు వాడవచ్చును.


బట్టతలపై వెంట్రుకలు వస్తాయి 
  • బండి గురివింద ఆకుల రసమును నువ్వుల నూనెలో కలిపి తైలముగా కాయవలెను. ఆ తైలమును తలకు రుద్దుకొనుచుండిన బట్టతల తగ్గిపోయి వెంట్రుకలు వచ్చును.
  • సీతాఫలపు గింజలను మేకపాలలో నూరి తలకు లేపనము చేయుచుండిన ఎడల కొన్ని రోజులలో బట్టతలపై వెంట్రుకలు వచ్చును.

శారీరక బలము పెరుగుతుంది 
  • బాగుగా మగ్గిన అమృతపాణి అరటిపండ్లను తినుచుండిన శరీరమునకు మంచి బలమును కలిగించును. అన్ని విధములైన వ్యాధులు రాకుండా నిరోధించును.
  • బంగారమును నీళ్లలో వేసి కాచి త్రాగుచుండిన ఏనుగు వంటి బలము కలుగును.

మతిమరుపు పోతుంది
 

ప్రతిరోజు ఉదయం 3 గ్రాముల దాల్చిని చెక్కను నమిలి తినుచుండిన ఎడల కొన్ని రోజులలో మతిమరుపు తగ్గిపోవును.

- శ్రీ బాలరాజు మహర్షి గారు రచించిన 
'గృహవైద్యం' అనే గ్రంథం ఆధారంగా..