ప్రముఖుల మాట


అనిశ్చిత ఆర్థిక వ్యవస్థతో భారత్ ప్రపంచ విశ్వాసాన్ని కోల్పోయింది. ఆ విషయాన్ని గుర్తించటంలో ప్రభుత్వం విఫలమైంది. ప్రైవేటు రంగంలో స్వార్థపూరిత ప్రయోజనాల ప్రభావం ప్రభుత్వంపై పడింది.

- రతన్ టాటా, ప్రముఖ పారిశ్రామికవేత్త 


నేరమయ రాజకీయాల ప్రక్షాళన కోసం ఎన్నో వ్యవస్థలు, సంస్థలూ చొరవ తీసుకొంటున్నప్పటికీ, చట్టసభల సాక్షిగా అది వమ్మవుతోంది. నేరాలు రుజువై, రెండేళ్లు జైలుశిక్ష పడినవారిని, అప్పీలు పెండింగులో ఉన్నాసరే ఎన్నికల్లో పోటీ చేయకుండా నిరోధించాలన్న సుప్రీం తీర్పునూ పార్లమెంటు వేదికమీద ప్రభుత్వం తిప్పికొట్టడం అందుకు తాజా రుజువు.

- ఎ.సూర్యప్రకాశ్, పాత్రికేయుడు