చర్చి-క్రైస్తవాదాయ శాఖను వ్యతిరేకిస్తున్న క్రైస్తవులు


ఇదేమి శాఖ! ఎప్పుడూ వినలేదే?! అనుకుంటున్నారా? దేవాదాయ ధర్మాదాయ శాఖ ఉన్నది, హిందూభక్తులు దేవుడికి ఇచ్చిన కానుకలు, ధనం దోచుకోవడమే ఆ శాఖ పని. 

క్రైస్తవ మిషనరీల కార్యకలాపాలు, క్రైస్తవ విద్యాసంస్థల పనితీరు, వారి ఆదాయ వనరులు, ఆస్తులు మొదలైన విషయాలు పర్యవేక్షించడానికి ఒక శాఖను ఏర్పాటు చేయాలని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రప్రభుత్వం సంకల్పించింది. ఇందుకోసం ఒక చట్టాన్ని తెచ్చే ఆలోచనలో ఉన్నది. ఈ విషయం బయటకు పొక్కిన మరుక్షణం రాష్ట్రంలో క్రైస్తవులు గగ్గోలు పెడుతున్నారు. ఆంధ్రప్రదేశ్ ఫెడరేషన్ ఆఫ్ చర్చెస్ (ఎ.పి.ఎఫ్.సి.) ఆర్చి బిషప్పులు, బిషప్పులు, వివిధ చర్చిల ప్రముఖులు, క్రైస్తవులలో వివిధ వర్గాలవారు అందరూ కుమ్మక్కయి ప్రభుత్వ ఆలోచనను తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. ప్రభుత్వ చర్య రాజ్యాంగంలోని 26, 30 అధికరణాలకు వ్యతిరేకమని వారు వాదిస్తున్నారు. మరి నోరుమూసుకుని భరించడానికి వారేమైనా హిందువులా? 

- ధర్మపాలుడు