హిందువులకు నమ్మకమే కదా ! తుంగలో త్రొక్కండి..

 
ప్రస్తుతం జరిగిన చారిత్రాత్మకమైన ఎన్నికల  సమయంలో జరిగిన ఒక చిన్న సంఘటన.  కర్నాటక రాష్ట్రంలోని కోలారు నియోజకవర్గంలో ఒక పోలింగ్ కేంద్రంలో ఏప్రిల్ 17వ తేదీన పోలింగ్ జరుగుతున్నది. కేంద్రమంత్రి మరియు కాంగ్రెస్ అభ్యర్థి కె.హెచ్.మునియప్ప ఓటు వేయడానికి వచ్చారు. ఈ.వి.ఎం. దక్షిణ దిక్కుగా ఉండటం చూసి, వాస్తు ప్రకారం ఈ.వి.ఎం. తూర్పు దిక్కున ఉంటే బాగా ఉంటుందని, దానిని తూర్పు దిక్కున పెట్టించి ఓటు వేసి వెళ్ళిపోయారు. ఈ మార్పును తీవ్రంగా వ్యతిరేకించిన ఇతర పార్టీల వారు నానా రభస చేసి హిందువుల మూర్ఖత్వాన్ని ఖండించి ఈ.వి.ఎం.ను తిరిగి దక్షిణ వైపుకు మార్పించారు. 
 
ఇక్కడ ఒక ప్రశ్న ఉంది, ఈ.వి.ఎం. తూర్పున పెడితే నష్టం ఏమిటి? ఒకవేళ వాస్తు శాస్త్రం మీద నమ్మకం ముస్లింలకు ఉండి ఉంటే, ఒక మహమ్మదీయుడు ఈ.వి.ఎం. దిక్కును మార్చి ఉంటే ఇతర పార్టీల వారు ఇలాగే స్పందిస్తారా? అంత ధైర్యం ఉందా? 
 
- ధర్మపాలుడు