వినాయక సామూహిక ఉత్సవాలకు ప్రభుత్వం సహకారం అందించాలి

భాగ్యనగర్ లో జరిగిన బహిరంగ సభలో శ్రీ అశోక్ సింఘాల్ జీ


రాబోయే వినాయక చవితి ఉత్సవాలను దృష్టిలోఉంచుకుని కావలసిన ఏర్పాట్లు గురించి సెప్టెంబరు ఒవటవ తేదీ సాయంకాలం నిజాం కళాశాల క్రీడాస్థలంలో "భాగ్యనగరం వినాయక ఉత్సవ సమితి" ఏర్పాటు చేసిన ఒక భవ్యమైన బహిరంగసభ జరిగింది. వినాయక ఉత్సవ సమితి పదాధికారులు, శ్రీ పరిపూర్ణానందస్వామి, విశ్వహిందూపరిషత్ సంరక్షకులు శ్రీ అశోక్ జీ సింఘాల్ గారితో పాటుగా ఇతర ప్రముఖులు ఈ సభలో మాట్లాడారు.

శ్రీ సింఘాల్ మాట్లాడుతూ -"వినాయక మండప నిర్వాహకులపై పోలీసులు వేధింపులు ఆపాలి, ప్రతి మండపానికి ఉచిత విద్యుత్ అందించాలి. భాగ్యనగరానికి ప్రతిష్ట తెచ్చిన వినాయక సామూహిక ఉత్సవాలకు ప్రభుత్వం సహకారం అందించాలి, హిందువులపై దాడులు ఆపాల"ని కోరారు. "ప్రస్తుతం నడుస్తున్న లోక్ సభ సమావేశాలలోనే అయోధ్యలో శ్రీరామమందిర నిర్మాణం చేపట్టే విధంగా చర్యలు చేపట్టాలి. లేకపోతే రామభక్తుల ప్రభుత్వం వచ్చే విధంగా హిందువులు చర్యలు తీసుకుంటార"ని కూడా అన్నారు. "హిందువులు తమ సభలను నిర్వహించుకోవడానికి ఒక పెద్ద స్థలం భాగ్యనగరంలో కేటాయించాల"ని కూడా డిమాండు చేశారు. పెద్ద సంఖ్యలో ప్రజలు పాల్గొన్న ఈ సభ విజయవంతంగా ముగిసింది.