జలుబు తగ్గుతుంది

గృహ వైద్యము - 11

 
దగ్గు - జలుబు 

  • ఒక తులము ఉప్పు, రెండున్నర తులముల (30 గ్రాములు) గోధుమలు, రెండున్నర తులాల బెల్లము కలిపి లేహ్యములా చేయవలెను. దీనిని ఒక గ్రాము మాత్ర చొప్పున తినిపించిన చిన్న పిల్లలకు వచ్చు దగ్గు, జలుబు తగ్గును.
  • ఒక అరకప్పు వేడిపాలలో రెండు గ్రాముల పసుపు పొడి కలిపి దినమునకు రెండు మారులు సేవించిన జలుబు, పడిశము ఉపశమించును.
  • వేపాకులు పదిగ్రాములు, మిరియాలు 5 గ్రాములు కలిపి నూరి చిన్న మాత్రలుగా చేసి భద్రపరచవలెను. వాటిని రోజుకు రెండుమార్లు రెండేసి మాత్రల చొప్పున వేడినీళ్లతో సేవించిన జలుబు, పడిశము ఉపశమించును.

దద్దుర్లు  

  • వేప ఆకుల పొడిని 1 నుండి 2 గ్రాములు తగినంత తెనెతో కలిపి దినములో రెండుసార్లు సేవించిన దద్దుర్లు అణిగిపోవును.
  • ఉసిరికకాయల పొడి 1 నుండి 2 గ్రాములు ఆవు నెయ్యిలో కలిపి రోజుకు మూడుసార్లు తీసుకొనవలెను.

దురదలు  

వేపచిగుళ్లు, పసుపు రెంటినీ సమానంగా కలిపి నూరి శరీరానికి లేపనము చేసిన ఎడల దురదలు హరించును.

నత్తి  

ఆకు పత్రిని నోట్లో ఉంచుకుని రసము మింగుచుండిన ఎడల నత్తి హరించిపోవును.

దంతములు గట్టిపడుటకు 

ప్రతిదినము నేరేడు పుల్లతో పండ్లు శుభ్రపరచుకొనుచుండిన కదులుచున్న దంతములు గట్టిపడును.

- శ్రీ బాలరాజు మహర్షి గారు రచించిన 
'గృహవైద్యం' అనే గ్రంథం ఆధారంగా..