మహాభారత పద్యాలు (విదుర నీతి)

తనువున విరిగిన యలుగుల
ననువున బుచ్చంగవచ్చు, నతినిష్ఠురతన్

మనమున నాటిన మాటలు
వినుమెన్ని యుపాయములను వెడలునె యధిపా


భావం : రాజా ! దేహంలో గ్రుచ్చుకొన్న ములుకులను ఏదో ఉపాయంతో తీసివేయవచ్చు. కానీ మహా కఠినంగా హృదయంలో దిగబడిన మాటలు ఎన్ని ఉపాయములతోనూ వెలుపలికి రావు.

- తె. 2.62, సం.2.79, పు. 55