భిన్నత్వంలో ఏకత్వం - అనంతమైన సందేశం

శ్రీ శారదామాత
 
స్త్రీత్వం మాతృత్వం వైపుగా పరిణతి చెందాలి. ఈ మార్గాన్ని వీడిపోవడమే ప్రస్తుత సమాజ పతనానికి మూలకారణం. ఈ లోకంలోని బంధుత్వాలలో మాతృత్వం మాత్రమే పరిధులన్ని దాటుకుంటూ విస్తరిస్తుంది. భార్య అనే బంధుత్వాన్నే తీసుకొందాము. భార్య అనే స్థితిలో ఆమె ఒక వ్యక్తిని మాత్రమే ప్రేమించగలుగుతుంది. ఇలాగే ఇతర బాంధవ్యాలను పరిశీలించి చూస్తే అవన్ని ఒక నిర్ణీత పరిధిలో ఆగిపోతాయి. మాతృత్వం అనే ఉత్కృష్టమైన గుణం మాత్రం ఆడ, మగ, జాతి, భాష, ఇత్యాది అన్ని మానవ పరిధులను అతిక్రమించి లోకాన్నే కౌగిలిలో చేర్చుకోగలుగుతుంది. లోకాన్ని మాతృత్వం అనే ఉత్కృష్ట ప్రేమతో అక్కున చేర్చుకొనే క్రియాశీలత ఆమెను పారమార్ధిక ఉన్నత స్థితిగతులకు తీసుకొని వెళుతుంది. ఈ మాతృత్వ సాధనకు మనో పరిశుద్ధత, పరిపక్వత అత్యంత అవసరం.
 
- ధర్మపాలుడు