గోవుల రక్షణకు కేంద్ర ప్రభుత్వ ప్రణాళిక

 
ఆవులను మనం గోమాత అని వ్యవహరిస్తాం. మన భారతీయ ఆవులకు ఉన్న విశిష్టత కారణంగా ఆవులు దైవత్వాన్ని సంతరించుకున్నాయి. ఐదే వివిధ కారణాల వలన మన గో సంతతి నశించిపోతున్నది.
 
గత ప్రభుత్వాలు గో రక్షణకు ఎటువంటి చర్యలు చేపట్టకపోగా గో వధను సెక్యులరిజం ముసుగులో ప్రోత్సహించాయి. కాని ఇన్నాళ్ళకు మంచికాలం వచ్చింది. 12వ పంచవర్ష ప్రణాళికలో (2012-17) భాగంగా గోసంరక్షణ కోసం అయిదు వందల కోట్ల రూపాయల (రూ.500 కోట్లు) తో కేంద్రప్రభుత్వంచే 'రాష్ట్రీయ గోకుల్ మిషన్' ప్రారంభించబడింది.
 
ప్రస్తుతం మనదేశ పశుసంపద 20 కోట్లు. వీటిలో 83శాతం దేశీయ జీవాలు. వీటిని పరిరక్షించే చర్యలలో భాగంగా రాష్ట్రీయ గోకుల్ మిషన్ స్థాపిస్తున్నట్లు కేంద్ర వ్యవసాయశాఖ మంత్రి శ్రీ రాధామోహన్ సింగ్ తెలిపారు. మన గోవులను రక్షించటం, సంతతిని వృద్ధి చేయటం లక్ష్యంగా ఈ కార్యం సాగుతోంది. గ్రామాలలో, పట్టణాలలో గోకుల గ్రామాలను ప్రోత్సహిస్తారు. గో-పాలన సంఘంగా పిలవబడే ఈ సంస్థలను ప్రజలే నిర్వహిస్తారు. వివిధ ఆవు జాతులను పరిరక్షించి, వృద్ధిపరిచే పని గోపాలనా సంఘం వారు చేస్తారు. వీటిలో 60% పాలిచ్చే గోవులు కాగా 40% వట్టిపోయిన ఆవులు కూడా ఉంటాయి.
 
పాలు, పెరుగు, వెన్న మొదలైన గో ఉత్పత్తులను అమ్మడం మరియు గోమూత్రం, గోమయాలను ఔషధాలకు వాడడం ద్వారా లభించే ధనంతో గోపాలన జరుగుతుంది. కృష్నవెల్లి, నిమారి, వేచూరు, పుంగనూరు, పులికులం అనే ఉత్తమ గోఓజాతులు నశించే క్రమంలో ఉన్నాయి. వీటిని కూడా రక్షించి, పెంచిపోషించే బాధ్యతను రాష్ట్రీయ గోకుల్ మిషన్ చేపట్టనుంది.

- ధర్మపాలుడు