హిందువులో స్వాభిమానం నింపిన ఛత్రపతి శివాజి

 
ఛత్రపతి శివాజి హిందూ పద పాదుషాహిగా పట్టాభిషేకం చేసుకున్న తరువాత హిందువులు మళ్లీ తల ఎత్తుకుని తిరగడం ప్రారంభించారు. 
 
ఆ తదుపరి హిందువులు తమ గురించి స్వాభిమానంగా చెప్పుకొంటూ ప్రకటించుకొన్న విషయాలు - "హిందువు తన మాతృభూమిలో తిరిగి తన జాతిని పునర్ నిర్మించుకోగలడు, యుద్ధాలలో శత్రువులను ఓడించి నిర్మూలించగలడు, తన రక్షణ తాను స్వయంగా చేసుకోగలడు, తన సాహిత్య, కళా, విద్యా కౌశలాలను సాధించుకోగలడు, పదాతి, నౌకా సైన్యాలను నిర్మాణం చేసుకోగలడు, సముద్ర వాణిజ్యానికి ఓడరేవులు ఏర్పాటు చేసుకోగలడు. సముద్ర యుద్ధాలలో విజయాలు సాధించగలడు, విదేశీయులతో సమాన ప్రతిపత్తులతో సాధికారికంగా వ్యవహార, రాయబారాలు జరుపుకోగలడు". ఇదీ హిందువులో మొలకెత్తిన స్వాభిమానానికి నిదర్శనం.