రామసేతువు మాకు పవిత్రం - శ్రీలంక

 
రామసేతువు మాకు పవిత్రం, మాకు మాత్రమే కాక మొత్తం దక్షిణ ఆసియా ఖండానికే పూజనీయం అని ప్రకటించింది శ్రీలంక విదేశీయ మంత్రిత్వశాఖ. సేతుసముద్రం ప్రాజెక్టు ఒక ముదనష్టపు ప్రాజెక్టు అనీ, దానివలన పరిసర వాతావరణం కలుషితం అవుతుందనీ కూడా శ్రీలంక ప్రతినిధి పేర్కొన్నారు. భారతదేశాన్నీ, శ్రీలంకనూ భౌతికంగానూ, సాంస్కృతికంగానూ రామసేతువు కలుపుతున్నదనీ అంటూ ఎట్టి పరిస్థితులలోనూ రామసేతువు రక్షించబడాలని శ్రీలంక ప్రభుత్వం ఆకాంక్షిస్తున్నదని ప్రతినిధి తెలిపారు. ఇది ఇలా ఉంటే సేతువును ఎలా ధ్వంసం చేయాలా అని మన సెక్యులర్ ప్రభుత్వం వివిధ కుట్రలు పన్నుతున్నది.
 
- ధర్మపాలుడు