చైనాతో ధీటుగా భారత్ అణుసామర్ధ్యం

 
చైనా ఒక ప్రణాళికతో తన అణ్వాయుధాలను పెంచుకుంటూ పోతున్నది. భారత్ పాకిస్తాన్ లు కూడా కొద్దో గొప్పో వాటి పాటవాన్ని పెంచుకుంటున్నాయని ఫిలిప్ షెల్ ప్రకటించారు. స్వీడన్ దేశానికి చెందిన 'అణ్వాయుధ నిరోధక పరిశోధక పరిశోధన సంస్థ'లో పరిశోధకుడిగా ఫిలిప్ షెల్ పనిచేస్తున్నారు. ప్రధానంగా చైనాను దృష్టిలో పెట్టుకుని సుదూర లక్ష్యాలు ఛేదించే క్షిపణులను భారతదేశం రూపొందిస్తోందని కూడా ఆయన అన్నారు. వైమానిక దళం, నావికాదళాలు కూడా అటువంటి యుద్ధ సామర్ధ్యాన్ని సంతరించుకుంటూ రక్షణ వ్యూహంతో ముందుకు దూసుకుపోతున్నాయని ఫిలిప్ పేర్కొన్నారు.
 
 
- ధర్మపాలుడు