మోదీగారూ...తస్మాత్ జాగ్రత్త...

భారత ప్రధాని నరేంద్రమోదీ

2014 లో జరిగిన చారిత్రాత్మక ఎన్నికలతో భారతదేశ చరిత్రలో ఒక కొత్త అధ్యాయం మొదలయింది. మొదటిసారిగా ఒక సమర్థుడైన దేశభక్తుడి నాయకత్వంలో కేంద్రప్రభుత్వం ఏర్పాటయింది. కాని శ్రీ నరేంద్రమోదీ ప్రధానిగా ఇంకా జాగ్రత్త వహించవలసి ఉంది. కొందరు కాకారాయుళ్ళు మోదీ జీవిత చరిత్ర పాఠ్యపుస్తకాలలో ప్రవేశపెట్టాలని ఆలోచిస్తున్నట్లు వార్తలు వచ్చాయి. బాధ్యత కల పార్టీగా పేరున్న భా.జ.పా. ఇటువంటి ఆలోచనలకు దూరంగా ఉండడం శ్రేయస్కరం. తనను గురించి పాఠ్యపుస్తకాలలో పాఠాలు ప్రవేశపెట్టే విషయాన్ని నరేంద్రమోదీ పూర్తిగా వ్యతిరేకిస్తూ అటువంటి పిచ్చి పనులు చేయవద్దని ఆదేశాలివ్వటం చాలా సంతోషించదగ్గ విషయం. ప్రస్తుతం అందరి బాధ్యత ఒక్కటే. భారతదేశాన్ని బలోపేతం చేసి అభివృద్ధి పథాన నడపడం.

- ధర్మపాలుడు