కొండవీడులో గో (ఆవు) విశ్వవిద్యాలయం


గో సేవ చేయటానికి గోశాలలు నిర్మాణం గురించి విన్నాం, కాని గోవుల కోసం ఒక విశ్వవిద్యాలయం ఉండడం ఎప్పుడైనా విన్నామా? 

గుంటూరు పట్టణం, యడ్లపాడు మండలంలో గల కొండవీడు గ్రామంలో ప్రపంచంలోనే మొట్టమొదటి గో విశ్వవిద్యాలయం ఏర్పాటు కాబోతున్నది. కోటి రూపాయల వ్యయంతో నిర్మించబడే ఈ విశ్వవిద్యాలయాన్ని 'అంతర్జాతీయ కృష్ణ చైతన్య సంఘం (ISCON) వారు చేపట్టారు. గోసేవ, గోరక్షణ గురించి విశేష అధ్యయనంతో పాటుగా వట్టిపోయిన ఆవులను సంరక్షించడం, పంచగవ్యాలను వ్యవసాయ మరియు ఆరోగ్య పరిరక్షణకు ఉపయోగించడం, గో సేవనమే ఉపాధిగా ఏర్పాటు చేసే దిశగా విశ్వవిద్యాలయం పని చేస్తుందని కొండవీడు ఇస్కాన్ ఆలయ ప్రతినిధి రవీంద్ర కృష్ణ తెలియచేశారు. 20 ఆవులతో గోశాల జాగ్రత్తగా నిర్వహిస్తే నెలకు 30 వేల రూపాయల ఆదాయం కూడా పొందవచ్చని ఇస్కాన్ సభ్యుడు సత్యగోపీనాథం దాసు చెప్పారు. సేవ చేస్తూ కూడా ఆదాయాన్ని పొందే ఈ పథకం గురించి బాగా ఆలోచించి ప్రయోజనం పొందుతారని ఆశిద్దాం.

- ధర్మపాలుడు