భారత్ కు 'మామ్' అతి భారీ విజయం

ప్రముఖుల మాట

కె.రాధాకృష్ణన్, ఇస్రో చైర్మన్
 
మన సాంకేతికత సామర్థ్యం గురించి, అంతరిక్ష ప్రయోగవేదికలాంటి భారీ ఖర్చుతో కూడిన రంగంలో తక్కువ ఖర్చుతో విజయాలు సాధించే తీరు గురించి 'మామ్' (Mars Orbiter Mission - మార్స్ ఆర్బిటర్ మిషన్) చాటిచెప్పింది. త్వరలో చంద్రుడిమీదకు రోవర్ ను పంపేందుకు సైతం ఆలోచిస్తున్న భారతదేశం ఆ దిశగా కొత్త అవకాశాలను అన్వేషిస్తోంది. అదే సమయంలో, భూ ప్రభావిత కక్ష్యలోకి భారీ ఉపగ్రహాలను పంపించటం కోసం స్వదేశీ తయారిత క్రయోజనిక్ ఇంజన్ తో కూడిన జియోస్టేషనరీ ఉపగ్రహ నౌకను అభివృద్ధి చేసే సాంకేతికతలో ఇస్రో ఇంకా పట్టు సాధించాల్సి ఉంది. ఈ నేపథ్యంలో, అగ్రదేశాలకు దీటుగా అంతరిక్షంలో భారతదేశం ప్రయోగాలు సాధించడానికి మామ్ విజయం భారీ మద్దతు కాగలదు.
- కె.రాధాకృష్ణన్, ఇస్రో చైర్మన్