మహాప్రళయాన్ని తట్టుకుని నిలిచిన కేదారనాథుడు

 
ఇటీవలి ఉత్తరాంచల్ విషాదంలో కనీవినీ ఎరుగని విధ్వంసం, నష్టం జరిగాయి. ప్రకృతి వైపరీత్యం కంటే మానవుడి అత్యాశ, అనాలోచిత చర్యల కారణంగానే ఈ బీభత్సం జరిగింది. ముఖ్యంగా కేదారనాథ్ క్షేత్రంలో సర్వం నాశనమైంది. కాని ఆలయం ముందున్న నందికి ఏ మాత్రం నష్టం జరుగలేదు. ఇదే దైవ నిర్ణయం, మహత్యం. ఇది ఇలా ఉండగా భారత పురాతత్వ సర్వే డెహ్రాడూన్ సర్కిల్ సూపరింటెండెటు, శాస్త్రవేత్త శ్రీ అతుల్ భార్గవ్ మాట్లాడుతూ "కేదారనాథ్ ఆలయానికి వచ్చిన ముప్పు ఏమీ లేదని, వాతావరణం అనుకూలించగానే మళ్లీ 'బాగుచేత పనులు' చేపడతామని" అన్నారు. శుభం భూయాత్.
 
- ధర్మపాలుడు