ఇప్పుడు ఆ బాధ్యత భారతదేశానిది

 
లండన్ లో జరిగే భారత రాజకీయ సమ్మేళనానికి అధ్యక్షత వహించవలసిందిగా నేతాజీని ఆహ్వానించారు. కాని సుభాష్ ఇంగ్లాండులో ప్రవేశించరాదన్న ఆంక్షలు ఉన్న కారణంగా ఆయన వ్రాసి పంపించిన అధ్యక్షోపన్యాసాన్ని ఆ సమ్మేళనంలో చదివి వినిపించారు.

ఆ సందేశ సారాంశం ఇది..

'...రాజ్యాంగబద్ధమైన ప్రజాస్వామిక ప్రభుత్వాన్ని నెలకొల్పడం ద్వారా 17 వ శతాబ్దంలో ప్రపంచ నాగరికతకు ఇంగ్లాండు దోహదం చేసింది. అలాగే 18వ శతాబ్దంలో స్వేచ్ఛ, సమానత్వం, స్వాతంత్ర్యం అన్న నినాదం అందించడం ద్వారా ఫ్రాన్సు ప్రపంచ సంస్కృతికి ఎంతో మేలు చేసింది. 19వ శతాబ్దంలో మార్క్స్ వాదాన్ని అందించి జర్మనీ ప్రపంచానికి ఎంతో సేవ చేసింది. 20వ శతాబ్దంలో ప్రోలిటేరియన్ ప్రభుత్వం ప్రోలిటేరియన్ సంస్కృతి ప్రపంచం ముందుంచి ప్రపంచ నాగరికతను, సంస్కృతిని రష్యా ఒక మెట్టు పైకి తీసుకుపోయింది. ఇప్పుడు ప్రపంచ నాగరికతను, సంస్కృతినీ పెంపొందించే బాధ్యత భారతదేశం వహించవలసి ఉంది'. 
 
- సుభాష్ చంద్రబోస్