సుభాష్ చంద్రబోస్ జీవించే ఉన్నారా....?!

భారత స్వాతంత్ర్య పోరాటం జరిగే సమయంలో బ్రటిషు వారికి నిజంగానె చమటలు పట్టించిన విప్లవవీరులు ఇద్దరున్నారు. వారిలో ఒకరు వినాయ దామోదర సావర్కర్. అండమాన్ కారాగృహంలో యమ యాతనలు అనుభవించాడు. రెండవ వ్యక్తి నేతాజీగా పిలువబడే సుభాష్ చంద్రబోస్. నేతాజి బ్రిటిషువారి గృహనిర్బంధం నుండి 1941లో తప్పించుకుని విదేశాలకు పయనమై "భారత జాతీయ సైన్యం" (ఐ.ఎన్.ఎ.) స్థాపించి శత్రువుపై అలుపెరుగని పోరాటం చేశాడు. కాని 1945 ఆగస్టు 18న ఒక విమాన ప్రమాదంలో మరణించినట్లు ఒక వదంతి వ్యాపింపచేసి నేతాజి జాడ లేకుండా చేయడానికి అంతర్జాతీయ కుట్ర జరిగిన కారణంగా నేటికి కూడా నేతాజి గురించిన సమాచారం ప్రజలకు తెలియదు. 
ఇది ఇలా ఉండగా అమెరికా గూఢచారి సంస్థ సి.ఐ.ఎ. రహస్యంగా పరిశోధించి నేతాజి మరణించలేదని, జీవించే ఉన్నారని 1964లో ఒక రహస్య నివేదికను వారి ప్రభుత్వానికి అందచేశారు. మన ప్రభుత్వమేమో ఈ విషయం అనవసర రహస్యాన్ని పాటిస్తోంది. జరిగినదేదో జరిగింది. ఇప్పటికైనా వాస్తవాలు బయటికి రావాలి. కాబోయే ప్రధాని శ్రీ నరేంద్ర మోడి ప్రజల న్యాయమైన ఈ కోరికను మన్నిస్తారని ఆశిద్దాం.
- ధర్మపాలుడు