ప్రపంచాన్నే కబళించాలనుకుంటున్న చైనా

 
టిబెట్టు నాదే, అక్సాయ్ చిన్ నాదే, అరుణాచలం నాదే, కాశ్మీరూ నాదే అంటున్న చైనా జపాన్ దేశానికి చెందిన కొన్ని దీవులు కూడా తనవేనంటున్నది. జపాన్ అధీనంలోని సముద్ర ప్రాంతం కూడా తనదేనని కొంతకాలంగా చైనా వాదిస్తున్నది. ఈ కుట్రలోనే భాగంగా నవంబరు చివరి వారంలో చైనా ఒక క్రొత్త పేచీ మొదలుపెట్టింది. తూర్పు చైనా సముద్రంలో వివాదాస్పదంగా ఉన్న కొంత ప్రాంతాన్ని గగన రక్షణ గుర్తింపు క్షేత్రం (Air Defence identification Zone) గా ప్రకటించి, అక్కడికెవ్వరూ రాకూడదని "ఆదేశించింది". ఈ ప్రాంతంపై జపాన్ కు కూడా అధికారం ఉంది. చైనా దూకుడును అరికట్టాలని నిర్ణయించిన అమెరికా రెండు బి-12 బాంబర్ యుద్ధ విమానాలను "నిషిద్ధ" ప్రాంతానికి పంపింది. ఆ రెండు ఎయిర్ ఫోర్స్  యుద్ధ విమానాలు రెండు గంటలకు పైగా తూర్పు చైనా సముద్రంపైన యధేచ్చగా విహరించి తిరిగి వచ్చాయి. వాటిని అడ్డుకునే సాహసం చైనా చేయకపోవడం గమనించవలసిన విషయం.  చైనా చర్యను అనవసరమైన కవ్వింపు చర్యగా అమెరికా అభివర్ణించింది.
 
- ధర్మపాలుడు