భిన్నత్వంలో ఏకత్వం - అనంతమైన సందేశం

దత్తోపంత్ ఠేంగ్డే

"సనాతన ధర్మం అందించే అనంతమైన సందేశం 'అవిభక్తిం విభక్తేషు!' అంటే "భిన్నతలో ఏకత్వాన్ని దర్శించు!" అని. ఈనాటి పరిస్థితుల్లో ఇది చాలా ఉపయుక్తమైన విషయం. విభిన్నతల్ని బుల్ డోజర్ తో ఏకత్వంగా మార్చే ప్రయత్నం కుదరదు. అలాగే వాటిని పెంచి పోషించకూడదు. భిన్నంగా ఉన్నట్లు కనిపించే ప్రతి వర్గమూ వారి వారి మార్గాల్లో ఆత్మసంతృప్తిని సాధించే సర్వాధికారాన్ని కలిగించేందే ధర్మం. ప్రతివర్గమూ పరస్పర సత్సంబంధాలతో 'వసుధైవ కుటుంబ' సాధనకు ఒక నియమబద్ధమైన పద్ధతులను అనుసరించాలి. మానవాళి సామూహిక పరిజ్ఞానానికి అనుగుణంగా ప్రతివర్గమూ తమ తమ విజ్ఞాన పరిధుల్లో స్పందించాలి. అంతిమ లక్ష్యం సర్వతోముఖ అభివృద్ధి. అయితే మార్గాలు తమ సాంప్రదాయాలకు అనుగుణం కావచ్చు! గతంలోని అనుభవాల్ని భవిష్యత్తు రూపకల్పనతో మేళవిస్తూ వర్తమానాన్ని రూపొందించుకోవాలి. దీనికై అవసరమైన విషయాలు రెండు. ఒకటి - తప్పుల్ని వదిలెయ్యటం, రెండు - భవిష్యత్తును గురించి తగురీతిలో ఆలోచించడం.