సహనానికి పరీక్ష

ధుండి పుస్తకాన్ని నిషేధించాలని కోరుతూ ధర్నానిర్వహిస్తున్న హిందూ జాగృతి సమితి కార్యకర్తలు (ఫోటో - ది హిందూ సౌజన్యంతో)

ప్రపంచంలో అతి తేలికైన, ఎటువంటి ప్రమాదమూ లేని పని ఏమిటంటే హిందువులను, వారి సంస్కృతిని, ధర్మాన్ని అవమానించి, అవహేళన చేయడం. కర్నాటకలోని యోగేష్ మాస్టర్ అనే వ్యక్తి "ధుండి" అనే పుస్తకం రచించాడు. ఆ పుస్తకంలో వినాయకుడి గురించి అవాకులూ, చవాకులూ వ్రాసి, దూషించి మన దైవాన్ని, ధర్మాన్ని అవమానించాడు. హిందూ జనజాగృతి సమితి కార్యకర్తలు ఒక పెద్ద ప్రదర్శన మంగుళూరులో నిర్వహించి "ధుండి"ని నిషేధించాలని, రచయితను శిక్షించాలని గట్టిగా కోరారు. బెంగుళూరులోని సిటీ సివిల్ మరియు సెషన్స్ కోర్టు ఒక "ఇన్ జంక్షన్" ఆర్డరు ఇచ్చి సెప్టెంబరు వరకు ఈ పుస్తకాన్ని విడుదల చేయరాదని ఆదేశించింది. శ్రీరామసేన, హిందూజాగృతి సమితి తదితర హిందూ సంస్థలు రచయితను, పుస్తకాన్ని ఖండించాయి.

గొడవకు కారణమైన ధుండి పుస్తకం

- ధర్మపాలుడు