అది మతతత్వమూ, జాతి వ్యతిరేకమూనా..?

హితవచనం

శ్యాంప్రసాద్ ముఖర్జీ

370 ఆర్టికల్ గురించి నెహ్రూకు శ్యాంప్రసాద్ ముఖర్జీ ఒక లేఖ రాశారు. ఈ విషయంపై ప్రత్యక్షంగా కలిసి చర్చించాలని కూడా అందులో సూచన ఇచ్చారు. రెండురోజుల అనంతరం నెహ్రూ "మీ ప్రజా పరిషత్ ఉద్యమం పూర్తిగా మతతత్వమైనది, దీని గురించి కలిసి చర్చించవలసిన అవసరం నాకు కనిపించడం లేదు" అని అన్నారు. దీనికి సమాధానంగా శ్యాంప్రసాద్ మరో లేఖ ఘాటుగా వ్రాస్తూ ఇలా అన్నారు

-"ఇందులో మతతత్వం, జాతి వ్యతిరేకం ఏముంది? భారత రాజ్యాంగం మిగిలిన దేశమంతటికి మంచిదైనప్పుడు జమ్ముకాశ్మీర్ రాష్ట్రానికి వర్తింపచేయటంలో ఇబ్బంది ఏముంది? షేక్ అబ్దుల్లా, అతడి మిత్రులు కలిసి సాగిస్తున్న వేర్పాటువాద విధానాలను మీరు జాతీయత, దేశభక్తి అని ప్రశంసించడం, భారతదేశపు మౌలిక ఏకత్వాన్ని సాధించేందుకు, సాధారణ భారత పౌరులుగా జీవించేందుకు నిజాయితీగా కోరుతున్న ప్రజాపరిషత్ ను మీరు మోసకారిగా అభివర్ణించడం ఆశ్చర్యకరంగా ఉంది".