ప్రచారం అవసరం లేని కారుణ్యం

చిత్రపటం హిందూ దినపత్రిక సౌజన్యంతో
 
చెప్పడం కాదు ఆచరణలో చూపించేదే నిజమైన ధర్మం. "లోకాస్సమస్తాస్సుఖినోభవంతు" అంటారు హిందువులు. అన్నది ఆచరిస్తారు కూడా. దక్షిణ కర్నాటకలోని మాండ్య వద్ద మద్దూరు పట్టణ ప్రజలు రెండు దిక్కులేని ఊరకుక్కల కోసం లక్ష రూపాయలు వ్యయం చేసారు. రూ.25,000/- బహుమతి ప్రకటించారు. 15 దినాలు విశ్రాంతి లేకుండా ఊరూ వాడా వెతికారు. ఎందుకు? ఎప్పుడూ తమ మధ్య సందడిగా తిరుగుతూ ఉండే భైర, కెంచ అనే రెండు ఊరకుక్కలను పురపాలక సంస్థవారు పట్టి అటవీ ప్రాంతంలో వదలిపెట్టారు. మద్దూరు ప్రజలు అడవిని కూడా గాలించి భైర, కెంచలను రక్షించి తిరిగి తెచ్చుకున్నారు. పట్టణంలో పండుగ జరిగింది. ఇదండీ కారుణ్యం అంటే. కారుణ్యం పేరుతో మతమార్పిడి చేయడం కాదు - నోరు లేని జీవాల కోసం లక్ష వ్యయం చేసి 15 దినాలు ఊరంతా శ్రమించడం హిందువులకే సాధ్యం !

- ధర్మపాలుడు