జాతీయ పతాకాన్ని గౌరవించడం ఇస్లాంకు వ్యతిరేకమా?

 
ఈ మధ్యకాలంలో జరిగిన రెండు సంఘటనలు యాదృచ్ఛికమే కావచ్చు, కాని వేరు వేరు స్వరూపాలుగా జరిగాయి. ప్రతిసంవత్సరం ఆగష్టు 15వ తేదీన భారత స్వాతంత్ర్యదినం సందర్భంగా జాతీయపతాకాన్ని ఆవిష్కరించి, వందనం చేయటాన్ని ఒక జాతీయ పండుగగా భావించి ఆ పండుగలో అందరమూ పాల్గొని నాటి పోరాట పటిమను, మన జాతీయ యోధుల జీవితాలను, వారు చేసిన త్యాగాలను గుర్తుచేసుకొని, అవి మనకు స్ఫూర్తినివ్వాలని కోరుకొంటూ తీపి మిఠాయిలు తిని పండుగను ఆస్వాదిస్తాము. 
 
అదేవిధంగా ఈ సంవత్సరం కూడా చేసుకున్నాము. కాని కొన్ని స్వార్ధశక్తుల ప్రలోభాల వల్ల కొందరు అమాయకులు ఆ జాతీయ ఉత్సవంలో పాల్గొనటానికి నిరాకరించి, తమ దేశ వ్యతిరేకతను బాహాటంగా చాటుకోవటానికి దుస్సాహసం చేశారు. పైగా దానిని సమర్థించుకున్నారు కూడా. వీరు ఈ విధంగా ప్రవర్తించటం వెనుక ఎటువంటి జాతివిద్రోహకర శక్తులున్నాయనే విషయాన్ని వెలుగులోకి తీసుకురావడం ముఖ్యం. 
 
వివరాలలోకి వెళితే... తెలంగాణ రాష్ట్రంలోని ఖమ్మం జిల్లా నేలకొండపల్లి మండలం సుర్దేపల్లి గ్రామ ప్రభుత్వ పాఠశాల ప్రధానోపాధ్యాయుడైన ఎం.డి.షరీఫ్్ తన పాఠశాలలో జెండావందన కార్యక్రమంలో జాతీయజెండా ఎగురవేయడానికి, జెండాకు వందనం చేయడానికి, కొబ్బరికాయ కొట్టడానికి నిరాకరించి, జాతీయజెండాను విసిరికొట్టి విసవిస పాఠశాలను వదిలివెళ్ళిపోయాడు. జాతీయజెండాను ఎగురవేయటం కాని, దానికి వందనం చేయటం కాని తను పఠించే ఖురాన్ కు వ్యతిరేకమని, అవసరమైతే ఉద్యోగానికి రాజీనామ చేస్తానని చెప్పాడు. 
 
ఒకదేశంలో నివసించే ప్రజలందరూ ఆ దేశ జాతీయ విలువలను గౌరవించి తీరాలి. లేదంటే అది అతిపెద్ద దేశద్రోహం అవుతుంది. ఈ విషయాన్ని ఆ మతపెద్దలు వాళ్ళకు తెలియజెప్పవలసిన అవసరం ఉంది.
 
అదేరోజున బీహారులోని పాట్నాకు 125 కి.మీ.దూరంలో గల బేగుసరాయ్ గ్రామంలో ప్రభుత్వ పాఠశాలలో ఉపాధ్యాయురాలిగా పనిచేస్తున్న శ్రీమతి నజియాఖాన్ ఆగష్టు 15న జెండావందనం కార్యక్రమంలో పాల్గొని ఇంటికి వెళ్లింది. ఈ విషయం తెలిసిన ఆమె భర్త ఉమర్ ఖాన్ తీవ్ర కోపోద్రిక్తుడై ఆమెను తన పిల్లలతో సహా ఇంటిలో నుండి వెళ్ళగొట్టాడు. విడాకులు ఇస్తానని కూడా బెదిరించాడు. జెండాకు వందనం చేయటం షరియత్ చట్టాన్ని ఉల్లంఘించడమేనని దూషించాడు. 
 
ఇదీ ఈ సంవత్సరం ముస్లింల ప్రవర్తనలో వచ్చినమార్పు. ఈ పనిని ఈ ఇద్దరు మాత్రమే చేసి ఉండవచ్చు, కాని తమ మతం వీటన్నింటికి మించినది, భిన్నమైనది అనే భావన ఎక్కువమందిలో ఉన్నది. దాని పరాకాష్ట ఇలా జాతీయ పతాకాన్ని అవమానించటం. ఒకదేశంలో నివసించే ప్రజలందరూ ఆ దేశ జాతీయ విలువలను గౌరవించి తీరాలి. లేదంటే అది అతిపెద్ద దేశద్రోహం అవుతుంది. ఈ విషయాన్ని ఆ మతపెద్దలు వాళ్ళకు తెలియజెప్పవలసిన అవసరం ఉంది. ఇంత పెద్ద భారతదేశంలో ఒకేవిధమైన సంఘటన రెండు ప్రదేశాలలో వేరువేరుచోట్ల ఒకేవిధమైన భావనతో జరిగిందంటే ఆ సంఘటన వెనుక ఏదోఒక బలమైన శక్తి పనిచేసినట్లుగా ఉన్నది. ఆ శక్తి ఏమిటి. దాని ప్రధాన ఉద్దేశ్యం ఏమిటనేది తెలుసుకోవలసిన అవసరం ప్రభుత్వానికి ఎంతైనా ఉన్నది. 
 
చరిత్రలోకి వెళ్లిచూస్తే - స్వాతంత్ర్య పోరాటకాలంలో కాకినాడలో ఒకసారి కాంగ్రెసు మహాసభ జరిగింది. ఆ సభ ప్రారంభంలో మనం ఇప్పుడు పాడుతున్న వందేమాతరం గీతాన్ని ఆలపించేందుకు విష్ణు దిగంబర్ పులస్కర్ అనే గాయకుడు వేదికపైకి వచ్చాడు. వందేమాతర గీతం పాడటం ప్రారంభించాడు. ఆ సమయంలో 'వందేమాతర గీతం మా మత నిబంధనలకు వ్యతిరేకం, నేను పాడను' అని వేదికపై ఉన్న అప్పటి ముస్లిం నాయకుడు క్రిందికి వచ్చేసాడు. అతనిని అనుసరించి మిగతా నాయకులు కూడా క్రిందికి వచ్చేసారు. గీతాలాపన పూర్తయిన తరువాత తిరిగి వేదికపైకి వచ్చారు. కాని ఆ ముస్లిం నాయకుడిని మాత్రం ఎవరూ ప్రశ్నించలేదు. 
 
జాతీయ ఏకతను చాటే జాతీయగీతం పాడటం తమమతానికి వ్యతిరేకమని నాడు మేధావులన్నారు. నేడు సామాన్యులు అంటున్నారు. నేటి సంఘటన సామాన్యులకు సంబంధించినది కావచ్చు, కాని ఆలోచన ఒకటే. దీనినిబట్టి ముస్లింలు ఈ జాతీయ జీవనస్రవంతిలో పూర్తిగా విలీనం కాలేదు. తమ ప్రత్యేకతలను కాపాడుకొంటూ తమ అసహనాన్ని ప్రదర్శిస్తూనే ఉన్నారు. నాటి నుండి నేటి వరకు అది పునరావృతమవుతూనే ఉన్నది. దీనిపై సెక్యులర్ మేధావులు నోరు విప్పరు. 
 
ఇటువంటి ఆలోచనల నుండి ముస్లింలు బయటపడి దేశ సంస్కృతులకు మొదటి ప్రాధాన్యం ఇవ్వాలి.