తిరుమలలో ఇస్లామిక్ యూనివర్శిటీ..?

 
తిరుమల కొండకు కాలినడకన వెళ్లే దారిలో చంద్రగిరి మండలం శ్రీవారి మెట్టు దగ్గర "హీరా ఇంటర్నేషనల్ ఇస్లామిక్ కాలేజి" పేరుతో అంతర్జాతీయ ఇస్లామిక్ యూనివర్శిటీ ఏర్పాటు చేస్తున్నారు. నాహెర షేక్ చైర్మెన్ గా గల "హీర ఉర్దూ అరబిక్ డెవలప్ మెంట్ సొసైటి" పేర దీనిని నిర్మిస్తున్నారు. ఇదే సొసైటీ పేర ఆ స్థలంలో కాలేజి, మదర్సా, అరబిక్-ఉర్దూ పాఠశాలను నిర్వహిస్తున్నారు. వాస్తవానికి ఈ స్థలం దేవాదాయ శాఖకు సంబంధించినది. 1.09 ఎకరాల విస్తీర్ణంలో 6 అంతస్తుల భవనాన్ని సెంట్రలైజ్డ్ ఎ.సి.తో కార్పొరేట్ హోటల్స్ స్థాయిలో, అంతర్జాతీయ విలాసాలతో నిర్మిస్తున్నారు. వాస్తవానికి 2011లోనే దేవాదాయ శాఖ స్థలంలో ఈ భవన నిర్మాణం చేపట్టడం జరిగింది. దీనికి తిరుపతి పట్టణాభివృద్ధి సంస్థ అనుమతులు లేవు. అధికారుల నిర్లక్ష్యం వల్ల దానిని అంతర్జాతీయ మహిళా విశ్వవిద్యాలయంగా మార్చాలనే ప్రయత్నాలు కూడా జరుగుతున్నాయి. ముస్లిం మహిళలకు స్వయం ఉపాధి కోర్సులతో పాటు ఇస్లాం మత బోధనల కోసమే ఈ విశ్వవిద్యాలయాన్ని ఏర్పటు చేస్తున్నట్లు నిర్వహకులు చెబుతున్నారు. ఈ మేరకు www.heerauniversity.com అనే పేరుతో ఇంటర్ నెట్ లో వెబ్ సైట్ ఏర్పాటు చేసి ప్రచారాన్ని సాగిస్తున్నారు. 
 
దీని వ్యవస్థాపకురాలు నౌహీర్ అనే మహిళ ఇటీవలి 2005 సంవత్సరం వరకు సాధారణ గృహిణిగా ఉన్నారు. ఈమె 2005లో ఉపాధి కోసం గల్ఫ్ దేశాలకు వెళ్లివచ్చారు. ఈ ఎనిమిదేళ్ల అనతికాలంలో ఆమె అనేక విద్యాసంస్థలనే గాక, ఫైనాన్స్ (ఆర్థిక) వ్యాపారాలు, రియల్ ఎస్టేట్ వ్యాపారాలలో పెట్టుబడి పెట్టడమే కాకుండా రాజకీయ రంగంలో ప్రముఖులతో పరిచయాలు పెంచుకుంది. ఇదంతా కూడా అరబ్ దేశాల నుండి మతం పేరిట విరాళాలను అక్రమ మార్గంలో సేకరించి అతి తక్కువ కాలంలో ఆదాయానికి మించి ఆస్తులను సేకరించినట్లుగా స్థానికులు చెప్పుకుంటున్నారు. ఈ ప్రభావంతోనే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలలో కీలక స్థానాలలో ఉన్న వ్యక్తులను ప్రభావితం చేయగలిగిందని భావిస్తున్నారు. 
 
"ప్రస్తుతం తిరుమల తిరుపతి దేవస్థానాలతో సహా రాష్ట్రంలోని అన్ని ప్రముఖ దేవాలయాలు తీవ్రవాదుల లక్ష్యాలుగా ఉన్నాయని కేంద్ర నిఘా విభాగాలు హెచ్చరిస్తున్న నేపథ్యంలో తిరుమల, తిరుపతి, శ్రీనివాసమంగాపురం, అలిమేలు మంగాపురం, శ్రీవారిమెట్టు, శ్రీకాళహస్తి వంటి ప్రముఖ అధ్యాత్మిక కేంద్రాలు అతి దగ్గరలో ఇస్లామిక్ మహిళా విశ్వవిద్యాలయాన్ని నెలకొల్పవలసిన అవసరం ఏమున్నది? తిరుపతిలో ప్రత్యేకించి మహిళా యూనివర్శిటీ ఉండగా దానికి అతి సమీపంలో ఇస్లామిక్ విశ్వవిద్యాలయం ఏర్పాటు చేయవలసిన అవసరమేమున్నదని స్థానికులు ప్రశ్నిస్తున్నారు. వీరు నిజంగా మహమ్మదీయ మహిళలకు సేవ చేయదలచుకుంటే వేరే ప్రాంతాలలో నెలకొల్పి సేవ చేయవచ్చు కదా!" అని కూడా అనుకుంటున్నారు. 
 
కాగా, రాష్ట్రంలో ఇస్లామిక్ విశ్వవిద్యాలయం ఏర్పాటు చేయుటకు అనేకచోట్ల అనువైన ప్రదేశాలు అనేకం ఉండగా ప్రపంచంలో ప్రముఖమైన, భారతీయులకు అతి ముఖ్యమైన, కలియుగ వైకుంఠంగా భాసిల్లుతున్న తిరుమల సమీపంలో ఇస్లామిక్ విశ్వవిద్యాలయాని్న ఏర్పాటు చేయడం హిందూ ధర్మంపై ఒక పథకం ప్రకారం జరుగుతున్న ఒక కుట్ర అని, అంతేగాక ఇది హిందుత్వంపై జరుగుతున్న ఒక దాడి అని ఇటీవల భక్తి టివి కార్యక్రమంలో పాల్గొన్న పలువురు ప్రముఖులు తమ అభిప్రాయం వ్యక్తం చేశారు. 
 
- పతికి