ప్రముఖుల మాట


 
ధర్మాన్ని పాటించటం, దానిని వ్యాప్తి చేయటం మా కర్తవ్యం. సామాన్య ప్రజలు ఆనందంగా, ప్రశాంతంగా జీవించటానికి మా మఠం పని చేస్తుంది. పేరు ప్రతిష్ఠలు వస్తుంటాయి, పోతుంటాయి. మేము పట్టించుకోము. భక్తుల ఆధ్యాత్మిక తృష్ణను తీర్చటానికి మాకు ఆదిశంకరులు, మా పరమాచార్య మార్గదర్శనం మాకు ఉంది.

- శ్రీశ్రీశ్రీ జయేంద్ర సరస్వతి స్వామి

 
 
ప్రతిపాదించబడిన కమ్యూనల్ వాయిలెన్స్ బిల్ ఒకవేళ పార్లమెంటులో గట్టెక్కినా అది అమలు కాదు. రాజ్యాంగంలోని ఆర్టికల్ 15లోని వ్యక్తుల మౌలిక హక్కుల రక్షణకు ఇది వ్యతిరేకం. దేశ సమగ్రత, సమైక్యతలకు ఇది అడ్డంకి. రాజ్యాంగ సవరణ ద్వారానైనా అమలు చేయాలని ప్రయత్నిస్తే సుప్రీంకోర్టులో నిలవలేదు.

- జస్టిస్ రామాజోయిస్