సక్షమ్ భాగస్వామ్యంతో అంధ విద్యార్థులకు ఉద్యోగ ప్రయత్నంలో శిక్షణ

 
ఈ మధ్య భాగ్యనగర్ లో ఒరాకిల్ అకాడమి, ఎల్.వి.ప్రసాద్ ఐ ఇన్స్టిట్యూట్, సక్షమ్ ల ఆధ్వర్యంలో అంధులు, పాక్షిక అంధులైన విద్యార్థులకు హెచ్.ఆర్.సాఫ్ట్వేర్ సొల్యూషన్స్ లో 4 రోజుల శిక్షణా కార్యక్రమం నిర్వహించబడింది. ఇందులో ఏడుగురు అండర్ గ్రాడ్యుయేట్ విద్యార్ధులు పాల్గొన్నారు.  
 
ఈ శిక్షణ ఆ విద్యార్ధులకు ఉద్యోగ ప్రయత్నాలలో ఉపయోగపడుతుంది. దీని ద్వారా వ్యాపార విషయాల విశ్లేషణ మొదలైన పనులు చేయగలుగుతారు. బ్రెయిలి లిపిలో ఇది నేర్పించారు. అంధ విద్యార్థులకు ఇటువంటి ఉపయుక్తమైన అనేక కార్యక్రమాలను సక్షమ్ నిర్వహిస్తున్నది. సక్షమ్ అంగవికలురకు సంబంధించిన జాతీయ సంస్థ. సక్షమ్ 'మాధవ ఐ బ్యాంక్' అనే పేరుతో 40 'ఐ' బ్యాంకులు నిర్వహిస్తున్నది.