ముస్లింలంటే ప్రభుత్వానికి ఎందుకంత ప్రేమ?


ఈ మధ్య కేంద్ర హోంశాఖ మంత్రి సుశీల్ కుమార్ షిండే రాష్ట్ర ప్రభుత్వాలకు వ్రాసిన లేఖ ఒకటి బయటపడింది. అమాయక ముస్లిం యువకులను వివిధ భ్రదతా సంస్థలు వేధిస్తున్నాయంటూ కేంద్రప్రభుత్వానికి ఫిర్యాదులు వస్తున్నాయి. దీనిపై తక్షణం స్పందించాలని ఆ లేఖలో ఆయన కోరారు. కేంద్రప్రభుత్వంలో గృహమంత్రిగా ఉన్న ఆయన ఇలా అమాయకంగా మాట్లాడటం ఆశ్చర్యాన్ని కలిగిస్తున్నది. ఇట్లా మాట్లాడటం ఒక రాజకీయ ఎత్తుగడ. దూరమైన ముస్లిం ఓట్ బ్యాంకులను దగ్గర చేసుకొనే వ్యూహం. ఉగ్రవాదానికి మతం లేదని చెప్పే నాయకులు ఉగ్రవాదులుగా మారుతున్నముస్లింలను "సాధారణ ముస్లిం యువకులు"గా ఎందుకు గుర్తింపునిస్తున్నారు? ఎందుకంటే ఉగ్రవాదులుగా పట్టుబడుతున్న వారంతా ముస్లిం యువకులే కాబట్టి. కాంగ్రెస్ వారు ఎందుకిట్లా మాట్లాడుతున్నారో అందరికీ తెలుసు.