ప్రపంచ భాష సంస్కృతం

 
"యా సంస్కృతా ధార్యతే - వాక్ భూషణం భూషణం" అన్నాడు భర్తృహరి. ప్రపంచవ్యాప్తంగా మన సంస్కృత భాషను ఆదరించి నేర్చుకునేవారి సంఖ్య క్రమంగా పెరుగుతున్నది. క్లుప్తంగా చెప్పాలంటే అమెరికా, జర్మనీ, ఫ్రాన్స్ వంటి పాశ్చాత్య దేశాల విశ్వవిద్యాలయాలలో ఇప్పుడు సంస్కృతం విరివిగా బోధించబడుతున్నది. ఆ వరుసలో ఆస్ట్రేలియా కూడా చేరింది. ఆస్ట్రేలియా భాషావేత్తలు కాశీకి వచ్చి సంస్కృత భాషను, హిందూ ధార్మిక అంశాలను నేర్చుకుని తిరిగి వెళ్ళి వారి విద్యార్థులకు నేర్పుతున్నారు. ఆస్ట్రేలియా జాతీయ విశ్వవిద్యాలయం (ANU) లో వరిష్ట ఆచార్యుడిగా ఉన్న ప్రొఫెసర్ మెక్ కొమా టేలర్ మాటల్లో చెప్పాలంటే "సంస్కృత భాష, హిందూ సంస్కృతి వల్ల నేను ఎంత ఉన్నతిని సాధించానంటే, అందరికీ సంస్కృతం బోధించడమే పనిగా పెట్టుకున్నాను. సంక్లిష్టమైనప్పటికీ బహు సుందరమైన సంస్కృత భాష ద్వారా ఎంతటి విజ్ఞానకరమైన భావాన్ని కూడా వ్యక్తీకరించవచ్చును" .

సిడ్నీ విశ్వవిద్యాలయానికి చెందిన డాక్టర్ పేతురు ఫ్రెన్డ్ లెండర్ తరచుగా కాశీకి వచ్చి ఎన్నో విషయాలు నేర్చుకుని వెళుతూ ఉంటారు. సిడ్నీ విశ్వవిద్యాలయంలో సంస్కృత భాషా బోధనకు ఒక డిగ్రీ కోర్సు ప్రవేశపెట్టారు.

కొసమెరుపు : భారతీయ భాషల అధ్యయనంలో భాగంగా "ఉర్దూ" భాషను కూడా విశ్వవిద్యాయంలో ప్రవేశపెట్టారు. కానీ! విద్యార్థులు ఏమాత్రం ఆసక్తి చూపని కారణంగా ఉర్దూ భాషను వారి ప్రణాళిక నుంచి తొలగించారు.

- ధర్మపాలుడు