తన కోపమె తన శత్రువు

ఏరిన ముత్యాలుతన కోపమె తన శత్రువు
తన శాంతమె తనకు రక్ష, దయ చుట్టంబౌ
తన సంతోషమె స్వర్గము
తన దు:ఖమె నరకమండ్రు తథ్యము సుమతీ !భావం : ఓ సుబుద్ధీ! మనిషికి తన కోపమే తన శత్రువు. శాంతగుణమే రక్ష. దయా స్వభావమే చుట్టము వంటిది. అతని సంతోషమే అతనికి స్వర్గము. దు:ఖమే నరకము. ఇది నిశ్చయము.