విజయ చిహ్నం ఏ.బి. వాజపేయ్

అటల్ బిహారీ వాజపేయి
2014లో జరుగుతున్న చారిత్రక ఎన్నికలలో కాబోయే భారత ప్రధానమంత్రి మోడీ వారణాసి (కాశీ) నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్నారు. ఇదే నియోజకవర్గం నుంచి గతంలో అటల్ బిహారీ వాజపేయి కూడా విజయం సాధించారు.

1957లో జరిగిన రెండవ సార్వత్రిక ఎన్నికలలో వాజపేయి యు.పి.లో బలరాంపురం, మథుర, లక్నో నుంచి పోటీ చేసి బలరాంపురం నుంచి గెలిచి లక్నోలో రెండో స్థానంలో నిలిచారు.

నాలుగు రాష్ట్రాలలో ఉన్న ఆరు వివిధ నియోజకవర్గాల నుంచి పోటీచేసి గెలిచిన ఒకే ఒక వ్యక్తి అటల్ బిహారీ. మొత్తం పది పర్యాయాలు లోక్ సభకు పోటీచేసి గెలిచారు.

రెండు సందర్భాల్లో, రెండు వివిధ రాష్ట్రాలలో ఒకేసారి పోటీచేసి, రెండు నియోజకవర్గాలలో కూడా గెలిచిన ఘనత కూడా వాజపేయిదే. 1991 విదిశ (ఎం.పి.) మరియు లక్నో (యు.పి.) లో గెలిచారు. 1996లో గాంధీనగర్ (గుజరాత్) మరియు లక్నో (యు.పి.) లో పోటీచేసి గెలిచారు. చివరిసారిగా 2004లో లక్నో నుంచి పోటీచేసి గెలిచారు. శ్రీ వాజపేయి అనారోగ్య కారణాలతో ప్రస్తుతం రాజకీయాలకు స్వస్తి చెప్పి విశ్రాంతి తీసుకొంటున్నారు. 
- ధర్మపాలుడు