నపుంసకత రాదు

గృహ వైద్యము - 12

నపుంసకత :

వెల్లుల్లిపాయ

ప్రతిరోజు భోజనములో నియమపూర్వకంగా నేతిలో వేయించిన వెల్లుల్లిపాయలను 2 లేక 3 పాయలు తినుచుండిన ఎన్నటికీ నపుంసకత రాదు. ఆయువు క్షీణించదు, మోకాళ్లలో నొప్పులు రావు.

నరముల బలహీనత :

వేపకాయలు

  • పెను వేపగింజల నుండి తైలమును తీసి పూటకు 10 నుండి 15 చుక్కలు పాలలో కలిపి రోజుకు రెండు పూటలా సేవించవలెను.
  • ముషిణి గింజలు నల్లగా కాల్చి మసి చేసి, వడ్ల గింజంత మాత్ర (30 మి.గ్రా.) తేనె లేక వెన్నతో రోజుకొకసారి సేవించినచో నరముల బలహీనత నుండి బయటపడెదరు.

వేప గింజలు

  • మాల్కంగునీ గింజల నుండి తీసిన తైలం 10 నుండి 15 చుక్కలు రోజుకొకసారి పాలతో తీసుకొనుచుండిన నరములకు బలము కల్గును.

నడుము నొప్పి :

ఒక గ్లాసెడు మజ్జిగలో 15 మి.లీ. (3 టీ చెంచాలు) సున్నపు తేట కలుపుకొని ప్రతినిత్యము ఉదయం పూట పుచ్చుకొనుచున్న ఎడల 3 రోజులలో నడుము నొప్పి నుండి ఉపశమనము లభించును.

తేలు కాటు :

తేనె

  • ఇంగువను నీళ్లలో అరగదీసి తేలుకుట్టిన చోట పట్టీగా పూయవలెను.
  • తేలు కుట్టిన వెంటనే కొద్దిగా తేనెను త్రాగవలయును. అదే తేనెను తేలు కుట్టిన చోట పూయవలయును.

నిద్ర లేమి :

ఖర్జూరం కాయలు

ఖర్జూరం గింజలు

ఖర్జూరము గింజలు నీళ్లతో అరగదీసి ఆ గంధమునందు కొంచెము మంచి తేనె కలిపి, 2 నుండి 3 చుక్కలు కళ్లలో వేసిన నిద్రరాని వారికి సుఖముగా నిద్ర పట్టును.

నులి పురుగులు :

తమలపాకు

వేప గింజల చూర్ణమును అణా ఎత్తు (ఒక గ్రాము) మూడు తమలపాకులలో పెట్టి రోజుకొక్కసారి తినిపించిన ఎడల కడుపు, ప్రేవులలో ఉండే నులిపురుగులు నశించిపోవును. 

- శ్రీ బాలరాజు మహర్షి గారు రచించిన 
'గృహవైద్యం' అనే గ్రంథం ఆధారంగా..