ప్రాచీన గ్రామ పంచాయతీ పద్ధతే భారతదేశానికి సరియైనది


ఈ రోజుల్లో అందరూ ప్రజాస్వామ్యపు ఆధునిక పార్లమెంటరీ విధానాన్నే కావాలంటున్నారు. పార్లమెంటరీ విధానానికి పతనం తప్పదు. యూరప్ ని ప్రస్తుత దయనీయ స్థితికి తెచ్చిందదే. మనదేశంలో పాలన మన ప్రాచీన గ్రామ పంచాయతీ పద్ధతితోనే ప్రారంభమవాలి. అక్కడ నుండి క్రమేపీ పైకి పనిచేసుకుంటూ రావాలి. పంచాయతీలలో, వృత్తి సంఘాలలో ప్రజాప్రాతినిధ్యమెక్కువ. వాటికి ప్రజలతో సన్నిహిత సంబంధముంటుంది. ప్రజల భావాలలో అవి అంతర్భాగాలు. పార్లమెంటరీ వ్యవస్థలో స్థానిక సంస్థలు, పురపాలక సంఘాలు ఉంటాయి. అవి ఎందుకూ పనికిరావు. పురపాలక సంఘాలకు ప్రజలతో సంబంధమేమీ ఉండదు. కౌన్సిలర్లు వేదికలనెక్కి ఉపన్యాసాలిస్తారు. వారు మూడు సంవత్సరాల పాటు ఏమి చేస్తారో ఎవ్వరికీ తెలియదు. ఆ కాల పరిమితి ముగియగానే వాళ్లలో వాళ్లే అన్ని సర్దుబాట్లు చేసుకుంటారు. అధికారంలో ఉన్నన్నాళ్లూ తమ పబ్బం గడుపుకొని కొంత వెనక వేసుకుంటారు.

- ధర్మపాలుడు