అమెరికా ఇప్పుడు బంగారం కాదు


అమెరికా అంటే మనవారికి వ్యామోహం. 

అమెరికాయే ఆదర్శం అని, అదే స్వర్గం అని మురిసిపోతుంటారు. పైకి ఎంతో వైభవోపేతంగా కనిపించే అమెరికా సమాజం సమస్యల ఊబిలో ఇరుక్కుని కునారిల్లుతున్నది. అమెరికాలోని ప్రఖ్యాత నగరం డెట్రాయిట్ కి వాహనాల ఉత్పత్తిలో ప్రపంచంలోనే ఘనమైన పేరు ఉంది. ఇప్పుడు ఆ నగరం ఋణాల సుడిలో ఉక్కిరిబిక్కిరి అవుతున్నది. ఈ అప్పు అక్షరాల ఒక లక్షా ఏడువేల కోట్ల రూపాయలు (1,07,000,00,00,000) మాత్రమే. అన్ని రూపాయలు ఋణాలు ఈ రోజున చెల్లించలేని స్థితిలో ఉన్నది. నగరపాలక సంస్థ ఇన్ సాల్వెన్సీ పిటిషన్ వేసేందుకు సిద్ధపడుతున్నది. ఈ విషయం మిచిగాన్ రాష్ట్ర గవర్నర్ రిక్ స్నిదర్ తన వెబ్ సైట్ లో ఉంచారు. కాబట్టి మెరిసేదంతా బంగారు అనుకోవడం పొరపాటు.

- ధర్మపాలుడు