కూల్ డ్రింక్ త్రాగేటప్పుడు ఒకసారి ఆలోచించండి


చల్లని పానీయం (కోకాకోలా, పెప్సీ కోలా) ఒక బాటిల్ తయారు చేయటానికి అయ్యే ఖర్చు రెండు రూపాయలు. బజారులో దాని ధర 20 రూపాయలు. ఇలా ఎన్నో కోట్ల బాటిళ్లు. ఇంత లాభం రూపంలో మన దేశ సంపద సరిహద్దులు దాటుతున్నది. ఇది భారతదేశ ఆర్థిక వ్యవస్థకు నష్టము. అంటే దీని అర్థం విదేశీ కంపెనీలు మనలను ఆర్థికంగా తీవ్రంగా దోచుకుంటున్నాయి. మనం ఎవరికి వ్యతిరేకం కాదు. కాని మనలను మనం కాపాడుకోవలసిన అవసరం లేదా? కూల్ డ్రింక్ త్రాగేటప్పుడు ఒకసారి ఆలోచించండి.

ఆరోగ్యం కోసం కొబ్బరినీళ్లు త్రాగండి, నిమ్మరసం త్రాగండి, బత్తాయిరసం త్రాగండి. అంతేకాని అనారోగ్యం కలిగించే కూల్ డ్రింక్ ను ఎందుకు త్రాగాలో మీరే ప్రశ్నించుకోండి. మీ మిత్రులను అడగండి