రామసేతు వాదనల నుండి తప్పుకున్న సొలిసిటర్ జనరల్


తమిళనాడులోని రామసేతును ధ్వంసం చేయడానికి కేంద్రంలోని కాంగ్రెస్ ఆధ్వర్యంలోని యు.పి.ఎ. ప్రభుత్వం కంకణం కట్టుకుంది. గత దశాబ్దకాలంగా ఎందరో రామభక్తులు, చారిత్రక వారసత్వ అభిమానులు, ప్రజాసంఘాలు, స్వచ్ఛందసంస్థలు, తమిళనాడు రాష్ట్ర ప్రభుత్వం సైతం "సేతు సముద్రం షిప్పింగ్ ప్రాజెక్టు"ను వ్యతిరేకిస్తున్నారు. ఈ వ్యాజ్యం దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు వరకు చేరింది.


కాగా ఇటీవల ఈ విషయంపై సుప్రీంకోర్టులో వ్యాజ్యము కీలకమైన ముగింపు దశకు చేరినప్పుడు కేంద్రప్రభుత్వం తరపున సొలిసిటర్ జనరల్ గా వాదిస్తున్న సుప్రీంకోర్టు ప్రముఖ న్యాయవాది మోహన్ పరాశరన్ ఈ వ్యాజ్యం నుండి తప్పుకొంటున్నట్లుగా సుప్రీంకోర్టుకు, కేంద్ర న్యాయశాఖకు లిఖిత పూర్వకంగా ఈ విధంగా తెలియచేశారు. "నేను శ్రీరామునిపై ప్రగాఢ విశ్వాసము కలిగి ఉన్నాను. నేను శ్రీరాముని ఉనికిని ప్రశ్నించలేను. సేతుసముద్రంపై కేంద్రం 'రాముడు మిథ్య, రామసేతు మిథ్య' అని అఫిడవిట్ దాఖలు చేసిన దృష్ట్యా తన భావనలకు వ్యతిరేకంగా వాదించలేన"ని చెప్పి మోహన్ పరాశరన్ తప్పుకున్నారు. ఇది కేంద్రప్రభుత్వానికి కనువిప్పు కావాలి. మైనారిటీల సంతృప్తీకరణ కొరకు అధిక సంఖ్యాకుల మనోభావాలను పణంగా పెట్టడం మానుకోవాలి. 

- పతికి