హాస్య గుళిక


"అబ్బా సెగెట్రీ.. ఎప్పుడూ బిగినెస్సేనా.. మడిసన్నాక కూసింత కలాపోసన ఉండొద్దూ.." అన్నాడొక కాంట్రాక్టర్. మనం కూడా కొంచెం హాస్యాన్నిఆస్వాదిద్దాం.

ముజఫర్ నగర్ చీఫ్ జ్యుడిషియల్ మేజిస్ట్రేట్ గా ఉన్న కె.పి.సింగ్ ఒక కేసులో, ఢిల్లీ జమామసీద్ షాహీ ఇమామ్ సయ్యద్ బుఖారీని అరెస్టు చేయాలని ఆదేశిస్తూ "నాన్ బెయిలబుల్ అరెస్టు వారెంటు" జారీ చేశారు. అక్టోబర్ 25న న్యాయస్థానంలో ఉపస్థితి కావాలని ఆదేశించారు. 

ఇది వింటే పాతిక సంవత్సరాల క్రితం జరిగిన సంఘటన ఒకటి జ్ఞాపకం వస్తున్నది. 25 సంవత్సరాల క్రిందట కేరళ ఉన్నత న్యాయస్థానం, అప్పటి షాహి ఇమామ్ కు వ్యతిరేకంగా ఒక నాన్ బెయిలబుల్ అరెస్టు వారెంటు ఇచ్చారు. ఇమాంగారు కోర్టుకు రాలేదు. మళ్లీ వారెంటు ఇవ్వబడింది. ఈ విషయం తెలిసిన షాహి ఇమాం ఒక బహిరంగ ప్రకటన చేస్తూ "నేను ఢిల్లీలో నా గృహంలోనే ఉన్నాను. ధైర్యం ఉంటే పోలీసులు నన్ను అరెస్టు చేయవచ్చును" అని స్పష్టం చేశాడు.

ఆ షాహి ఇమాం ఇప్పటివరకు అరెస్టు కాలేదు. మరి ఈ ఇమాం అరెస్టు అవుతాడా? సమాధానం చెప్పడం హాస్యాస్పదమే అవుతుంది.

- ధర్మపాలుడు